
- పార్టీ సంస్థాగత అంశాలపైనే ప్రధాన చర్చ
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఈ నెల 27న 16 రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ, సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. కేవలం పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీ, సీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ను బూత్ స్థాయిలోకి తీసుకెళ్లడంపై ఈ మీటింగ్ లో ఖర్గే.. నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని పీసీసీ నేతలు అంటున్నారు.